ఆ ఇద్దరి విషయంలో కేసీఆర్ తప్పు చేసినట్టే…?
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ చాలావరకు బలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా కొన్ని కొన్ని తప్పులు మాత్రం ఎక్కువగా చేస్తారు. అగ్రనాయకత్వం విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అలాగే రెడ్డి సామాజికవర్గం కూడా ఎక్కువగానే ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ రెండు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఈ రెండు సామాజిక వర్గాల విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాల విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కువగా తప్పు చేస్తున్నాననే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుకు మంచి వర్గం ఉంది. ఆయనకు కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా మంచి మద్దతు ఉంటుందని చెప్పాలి. నల్గొండ జిల్లాలో కూడా ఆయన అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్లిన చాలామంది ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో తుమ్మల నాగేశ్వరరావుని అభిమానిస్తూ ఉంటారు.
కాబట్టి ఆయన విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆయనను కాదని పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా దాదాపుగా అందరికీ న్యాయం చేస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో తప్పులు చేస్తున్నారు. ఆయనకు కూడా ఎక్కువగా నల్గొండ ఖమ్మం జిల్లాల్లో అభిమానులు ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నేత ఆయన.
కాబట్టి ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంలో సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళు ఇబ్బంది పడుతున్న సరే చర్చలు జరపడం లేదు. అజయ్ కుమార్ ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుకి ప్రాధాన్యత లేకుండా పోయింది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర రావు వర్గం పెద్దగా ప్రచారం కూడా చేయలేదు అని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఎం కేసీఆర్ చెప్పిన బయటకు రాలేదని కొంతమంది అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో దూరంగా వ్యవహరించారు. రాజ్యసభ సీటు రాకపోవడం కనీసం ఎమ్మెల్సీ స్థానంలో అయినా సరే తన పేరు ప్రకటించకపోవడంతో పొంగులేటి కూడా ఇబ్బందిపడుతున్నారు. వీళ్లిద్దరు ఇబ్బంది పడటం తో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు టిఆర్ఎస్ పార్టీపై నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఆగ్రహంగా ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.













