కేసీఆర్ కూడా జగన్ బాటలో…?
తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పటివరకు కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళతారని సీఎం కేసీఆర్ భావించిన అటువంటి పరిస్థితి తెలంగాణలో పెద్దగా కనపడటం లేదని చెప్పాలి. రాజకీయంగా ఇప్పుడు కాస్త భిన్నమైన పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ గట్టిగా పోరాటం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కు స్వతంత్ర అభ్యర్థుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులుగా ప్రభావం చూపించడంతో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోవడంతో సీఎం కేసీఆర్ సినీ నటుల మీద ఎక్కువగా ఆధారపడే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి వివరించడానికి సినీ నటుల మీద ఆధారపడినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి హీరోలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2014 తర్వాత జరిగే 2019 తర్వాత కూడా తెలంగాణలో సమూలమైన మార్పులు వచ్చాయి. అన్నింటినీ కూడా వివరంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అంటే సినీ హీరో అయితే బాగుంటుందని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు. కాబట్టి వీరి ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళితే ఇతర రాష్ట్రాలకి కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కనపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడానికి అలాగే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సినీ నటుల మీద ఎక్కువగా ఆధారపడినట్టు అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.













