జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను సందర్శించిన ఇజ్రాయల్ రాయబారి

జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సను ఇజ్రాయెల్ దేశ రాయబారి రువన్ అజార్, వారి సతీమణి రచెల్ అజార్ సందర్శించారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు ఎస్.యాస్మిన్ భాషా, ఉద్యానశాఖ సంయుక్త సంచాలకులు రామలక్ష్మీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జీడిమెట్లలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి విశదంగా వివరించారు. ఈ సెంటర్‌లో సాగు అవుతున్న వివిధ పాలిహౌస్‌లలో వివిధ పంటలను హైటెక్ నర్సరీ ఉత్పత్తి అవుతున్న కూరగాయాల నారు మొక్కల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో లైక్ అహ్మద్, జలేందర్, రామకృష్ణ, శృతి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.