ఇక రేవంత్ పాద యాత్ర లేనట్టేనా ??
తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే మినహా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు దాదాపు గా లేవు అనే విషయం అర్థమవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎన్ని విధాలుగా ముందుకు నడిపించాలని ప్రయత్నం చేసినా సరే ఆ పార్టీ నేతలకు సాధ్యం కావడంలేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని అలాగే ప్రస్తుతం బలపడుతున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని ఆ పార్టీ నిలబడటం అనేది సాధ్యం కావడం లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్తోకూస్తో అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి.
అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అసలు గెలుస్తామో లేదో తెలియకుండానే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు యుద్ధం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అలాగే స్థానిక నాయకులు కొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంఆ ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
కానీ అలాంటి వాతావరణం ఇప్పుడు కనపడటం లేదని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి ఇటీవల పాదయాత్ర చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తాను పాదయాత్ర చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అని రేవంత్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. తాను పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ఇబ్బంది పడుతున్నారని అలాగే తనను ఇబ్బంది పెడుతున్నారని పార్టీ ఇబ్బంది పడుతుందని… అలాగే తనతో పాటు కలిసి వస్తున్న నేతలను ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఇప్పుడు తన పాదయాత్ర చేయడానికి సిద్ధంగా లేను అని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంగా ఆయనకు కొన్ని కొన్ని ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వచ్చాయి. ఇప్పుడు తాను పాదయాత్ర చేస్తే మరిన్ని ఇబ్బందులు పార్టీ నేతల నుంచి వచ్చే అవకాశాలు ఉండవచ్చు… కాబట్టి తాను పార్టీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందా…? రేవంత్ రెడ్డిని పాదయాత్రకు పంపిస్తుందా…? అనేది చూడాలి.













