తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలు

తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలున్నాయని పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ తెలిపారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరుగుతున్న ప్రపంచ పర్యాటక సదస్సుకు ఆమె హాజరయార్యరు. ఈ సంద్భంగా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆధ్వర్యంలోని ప్రవాస సంఘాల నేతలు రఘు చలిగంటి, బోయినపల్లి రమణ, మేఘన, నరేశ్, యోగానంద్ తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామని శైలజారామయ్యర్ వారికి తెలిపారు. ప్రవాసుల తరపున తెలంగాణను ఎక్కువ మంది సందర్శించేందుకు కృషి చేస్తామని చెన్నమనేని, ఇతర ప్రతినిధులు తెలిపారు.