US Consulate: యూఎస్ కాన్సులేట్ ఆధ్వర్యంలో… జాబ్ ఫెస్టివల్

యూఎస్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాబ్ ఫెస్టివల్ (Job Festival) 2024 సంగీత విభావరి కార్యక్రమాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు యూఎస్ కాన్సులేట్ జనరల్ (US Consulate General) ఒక ప్రకటనలో తెలిపింది. గోతె జంట్రమ్ హైదరాబాద్ సంస్థ భాగస్వామ్యంతో ఈ వేడుకను జరిపిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో అంతర్జాతీయ కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనతో అలరిస్తారని, అమెరికా విశేష ఆదరణ పొందిన జాబ్ సంగీత మాధుర్యాన్ని పంచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి ప్రవేశం ఉచితమని యూఎస్ కాన్సులేట్కు చెందిన జెన్నీఫర్ లార్సన్ అనే అధికారి తెలిపారు.