నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత

గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. ఇందులో ఎంతటి వారైనా వదిలేది లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు శనివారం కూల్చివేశారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్యలో ఎన్ కన్వెన్షన్ను అధికారులు నేలమట్టం చేస్తున్నారు.భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది.