హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 12 నుంచి 14 వరకు టై గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నట్లు నిర్వహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయెన్, గ్రీన్కో గ్రూపు ఎండీ, సీఈవో అనిల్ కుమార్‌లతో పాటు 2,500 మంది డెలిగేట్స్, 550కి పైగా టె చార్టర్ సభ్యులు హాజరుకానున్నారు. వీరితో పాటు 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200 కి పైగా పెట్టుబడిదారులు కూడా పాల్గొననున్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ వ్యవవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నట్టు టై గ్లోబల్ వైస్ చైర్మన్ మురళీ తెలిపారు.













