తెలంగాణలో అధికారంలోకి రాగానే.. అరగంలోనే
తెలంగాణలో అధికారంలోకి రాగానే అరగంటలో హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. చార్మినార్ వద్ద ఎన్నికల ప్రచారంలో బిశ్వశర్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పేరు మార్పు విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఉండవన్నారు. 2024 ఫిబ్రవరి నాటికి అస్సాంలో కామన్ సివిల్ కోడ్ అమలులోకి వస్తుందన్నారు. ఆ తర్వాత ఒక వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేందుకు వీలు కాదన్నారు. యూసీసీ ప్రకారం మరో మహిళలను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ముందుగా విడాకులు ఇచ్చి తర్వాతే రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందన్నారు.













