Numaish: నుమాయిష్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, ఫ్యూచర్ సిటీ (Future City)ని రాష్ట్రానికి తలమానికంగా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 85వ అఖిల బారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) (Numaish)ను భట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు తీసుకునే నిర్ణయాలు తాత్కాలికంగా కఠినంగా ఉన్నా భవిష్యత్ తరాలవారికి అందమైన నగరాన్ని అందించేందుకు తోడ్పడతాయన్నారు. నగరంలో పెట్టుబడులు పెరిగేలా అనువైన వాతావరణం కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థులు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించారని ఇలాంటి ప్రదర్శనల వల్ల వ్యాపార అవకాశాలు విస్తృతమవుతాయన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.






