అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. నోవాటెల్ హోటల్ వేదికగా ఇరువురి భేటీ జరిగింది. మునుగోడు సభ తర్వాత అమిత్‌షా నేరుగా రాత్రి 10:30 గంటలకు నోవాటెల్‌కు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆయన డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ఇరువూరు చర్చించారు. ఆమిత్‌షా ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ నోవాటెల్‌కు చేరుకుని ఆయనతో ఏకాంతంగా భేటీ అయినట్లు సమాచారం. తొలుత జూనియర్ ఎన్టీఆర్, అమిత్‌షాల మీటింగ్‌పై బీజేపీ అధికారికంగా స్పందించలేదు. తర్వాత బీజేపీ పార్టీ ఈ అంశంపై అధికారికంగా జూనియర్ డిన్నర్ సమావేశం ఖరారైనట్లు ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో వీరిరువురి సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం హాట్ టాప్‌గా మారడంతో అటు బీజేపీ కానీ, ఇటు జూనియర్ కానీ డిన్నర్ భేటీ వివరాలను వెల్లడించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డిలు జూనియర్ ఎన్టీఆర్‌ను సాదారంగా అహ్వానించిన నోవాటెల్ లోపలికి తోడ్కొని వెళ్లారు.













