వైద్యురాలి కుటుంబ సభ్యులకు ప్రముఖుల పరామర్శ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నార. ప్రియాంక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. తరువాత తెలంగాణ గవర్నర్ తమళిసై ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.













