ఎన్ఆర్ఐలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
దశాబ్దాల పాటు గల్ఫ్ దేశాలలో పని చేసిన హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం హెల్త్‌కార్డు ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు డాక్టర్ నియాజ్ అహ్మద్ ఖాన్ కోరారు. హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐల జంట నగరాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు తాము గల్ఫ్‌లో పడ్డ కష్టాలు, చేసినా ఉద్యోగాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నియాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐల్లో ఎక్కువ శాతం సౌదీ అరేబియా లోనే పనిచేశారన్నారు. వారు సంపాదించిన డబ్బును హైదరాబాద్‌లోనే పెట్టుబడి పెట్టి పలువురికి ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారన్నారు. త్వరలోనే తాము ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి ఎన్ఆర్ఐలు చేస్తున్న సేవలను వివరిస్తామన్నారు.













