Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు

లగచర్ల కేసులో నిందితుడి (ఏ1) గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి (Narender Reddy) కి నాంపల్లి కోర్టు (Nampally Court) బెయిల్ మంజూరు చేసింది. నరేందర్‌రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 24 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు, మిగతా రైతులకు రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.