పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం
పెండింగ్ లో ఉన్న బిల్లులపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మరో మూడు బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా వాటిలో తాజాగా ఒకదాన్ని తిరస్కరించి మిగిలిని రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. డీఎంఈ ( డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) సహా వైద్య విద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన చట్టసవరణ బిల్లును తమిళిసై తిరస్కరించారు. పురపాలికల్లో అవిశ్వాస తీర్మానం గడువును మూడు నుంచి నాలుగేళ్లకు పొడిగింపు, కో ఆప్షన్ సభ్యులు సంఖ్య పెంపునకు ఉద్దేశించిన పురపాలిక చట్టసవరణ బిల్లు, కొత్తగా మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్టసవరణ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో ప్రస్తుతం రాజ్భవన్లో ఎలాంటి బిల్లులు పెండిరగ్లో లేనట్లైంది. గతంలో మూడు బిల్లులను ఆమోదించిన గవర్నర్, మరో రెండిరటిని పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపించిన విషయం తెలిసిందే.













