పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : సీఎం రేవంత్
పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సంద్భంగా రేవంత్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభంగా అందిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తాం. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రానికి, పాక్స్కాన్ భవిష్యత్ ప్రాజెక్టులకు సహకారం అందిస్తాం అని తెలిపారు.













