ఫలక్ నుమా ప్రమాదానికి కారణం ఇదే!
ఫలక్నుమా రైలు అగ్ని ప్రమాద ఘటనకు విద్యుదాఘాతం కారణమని క్లూస్ టీమ్ అనుమానిస్తోంది. ఎస్4 బోగీలోని మూత్రశాల వద్ద విద్యుదాఘాతం జరిగినట్టు భావిస్తున్నారు. ఎస్4 బోగీలో విద్యుదాఘాతం వల్ల వచ్చిన మంటలు నిమిషాల్లో మిగతా బోగీల్లోకి వ్యాపించినట్టు క్లూస్ టీమ్ గుర్తించింది. ప్రమాదంలో కాలిపోయిన 5 బోగీలు క్లూస్ టీమ్ పరిశీలించి, వందకు పైగా నమూనాలను సేకరించింది. నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలిసే అవకాశముంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేదా ఓవర్ హిట్ వల్ల వైర్లలో మంటలు వచ్చి ఉండొచ్చని క్లూస్ టీమ్ అనుమానిస్తోంది.
పశ్చిమ బెంగాల్లోని హావ్డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలిక పరిధిలోని పగిడిపల్లి`బొమ్మాయిపల్లి శివారులో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దట్టమైన మంటల్లో చిక్కుకుని అయిదు బోగీలు పూర్తిగా కాలిపోరాయి. ఈ దుర్ఘటనతో రైల్వేకు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.













