భారత్ బయోటెక్ లో 50 మంది ఉద్యోగులకు…

కరోనా టీకా కొవాగ్జిన్‍ను ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థలో 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొవిడ్ కారణంగా 50 మంది ఉద్యోగులు అందుబాటులో లేరని, అయినప్పటికీ మీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు. అయితే టీకాల సరఫరా విషయంలో తమ కంపెనీ స్పందనపై కొన్ని రాష్‍ర్టాలు చేస్తున్న ఫిర్యాదుల పట్ల సుచిత్ర ఎల్లా స్పందించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ట్రాలకు కొవాగ్జిన్ షిప్‍మెంట్స్లో పంపామని ట్విటర్‍లో పేర్కొన్నారు. తమ ఉద్దేశాలపై కొన్ని రాష్ట్రాలు ఫిర్యాదులు తమకు నిరుత్సాహం కలిగిస్తున్నాయన్నారు.