బీజేపీలో చేరనున్న జయసుధ?
మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఆమె కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీలో ఆమె చేరికపై చర్చించినట్లు తెలుస్తోంది. జయసుధ బీజేపీలో చేరితే సికింంద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశముంటుందని భావిస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలో ఆహ్వానించగా, అందుకు సుముఖత వ్యక్తం చేశారు. గతంలో అమె కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకూ దూరంగా ఉన్నారు. అయితే బీజేపీలో చేరికపై జయసుధ స్పందించాల్సి ఉంది.













