హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన Evernex
ప్రపంచ మౌలిక సదుపాయాల సంస్థ Evernex భారత దేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ప్రారంభించింది. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నడేటా సెంటర్లు ఐటీ రంగానికి మెరుగైన అత్యుత్తమమైన సేవలను అందించేందుకు దీనిని ప్రారంభించారు. ఇప్పటికే దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది గణనీయంగా పెరుగుతుందని నివేదికలు కూడా సూచిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు, క్లౌడ్ సేవలు, ముఖ్యంగా ఏఐ అవసరాల కారణంగా డేటా సెంటర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీనితో డేటా సెంటర్లు ఐటీ రంగానికి విస్తృతమైన సేవలను, హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించింది.
Evernex సంస్థ సర్వర్లు, నెట్ వర్కింగ్, స్టోరేజ్ పరికరాల ఇన్ స్టాలేషన్, తరలింపు, అప్ గ్రేడ్, నిర్వహణ, సురక్షిత డిస్పోజల్ సేవలను అందిస్తుంది. మల్టీ వెండర్ మెయింటెనెన్స్, హార్డ్ వేర్ జీవితకాలాన్ని పొడిగించడం, ఐటీ నిర్వాహణ ఖర్చులను తగ్గించడం, కీలకమైన ఐటీ మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి సేవలను భారతీయ సంస్థలకు మరింత చేరువ చేయనుంది. ఇప్పటికే 160 కి పైగా దేశాల్లో కార్యకలాపాలు, 40 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన Evernex సంస్థ దేశంలో విస్తరిస్తున్న డేటా సెంటర్లు సమర్థవంతంగా పనిచేసేలా సహకరిస్తోంది. ఈ సేవల ద్వారా ఇప్పటికే వున్న హార్డ్ వేర్ వినియోగ కాలాన్ని పొడిగించడం, నిర్వహణ ఖర్చులను నియంత్రించడం, ఐటీ పరికరాలను బాధ్యతాయుతంగా తిరిగి వినియోగించడం, రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం సాధ్యపడుతుంది. Evernex లో 160 కి పైగా దేశాల్లో శిక్షణ పొందిన ఆన్ సైట్ ఇంజినీర్లు, 330 కి పైగా ఫార్వర్డ్ స్టాకింగ్ లొకేషన్లలో రీఫర్బిష్డ్ స్పేర్ పార్ట్స్, 24/7 సాంకేతిక మద్దతుతో ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన ఐటీ మౌలిక సదుపాయాలు నిరంతరాయంగా పనిచేసేలా ఈ సంస్థ తోడ్పడుతుంది. గత దశాబ్ద కాలంగా భారత దేశంలో కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ సంస్థ, దేశంలో తన ఆదాయాన్ని మూడు రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం డేటా సెంటర్ల ఐటీ రంగానికే పరిమితం కాకుండా, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఫార్మాస్యూటికల్స్, రంగాల్లోని సంస్థలకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. నేరుగా కస్టమర్లకు, అలాగే తన భాగస్వామ్య నెట్ వర్క్ ద్వారా సేవలను కూడా విస్తరిస్తోంది. హైదరాబాద్ ను భారత ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎంటర్ ప్రైజ్ సంస్థలు, ఛానల్ భాగస్వామ్యంతో సంబంధాలను బలోపేతం చేస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తన ఐటీ మెయింటెనెన్స్, లైఫ్ సైకిల్ మేనేజ్ మెంట్ సేవలను మరింత విస్తరించనుంది.
దీనిపై Evernex చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ ఫ్రాంకోయిస్ ప్రోస్పర్ట్ మాట్లాడుతూ భారత దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం అద్భుతమైన వేగంతో పెరుగుతోందన్నారు. ఈ మౌలిక సదుపాయాలన్నీ తయారీదారులు అందించే ప్రామాణిక సపోర్ట్ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నిరంతరంగా , విశ్వసనీయంగా పనిచేయాల్సిన అవసరం వుందన్నారు. కీలకమైన ఐటీ మౌలిక సదుపాయాలను నిరంతరం అందుబాటులో వుంచడం, వాటి వినియోగ జీవితకాలాన్ని పొడిగించడం, ఇప్పటికే వునన్ పరికరాల ద్వారా సంస్థలకు మరింత విలువలను అందించడం తమ సంస్థ ప్రత్యేకత అని తెలిపారు. హైదరాబాద్ లో తమ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా 160 కి పైగా దేశాల్లో విస్తరించిన తమ గ్లోబల్ సర్వీస్ నెట్ వర్క్ మద్దతుతో భారతీయ కస్టమర్లు, భాగస్వాములకు మరింత చేరువ అవుతున్నామని పేర్కొన్నారు.
దీనిపైనే Evwenex ఇండియా మార్కెట్ సేల్స్ డైరెక్టర్ దేబజాని బస్తియా మాట్లాడుతూ దేశంలోని తమ కస్టమర్లు, భాగస్వాములు తమకు స్థానికంగా అందుబాటులో వుండే, నేరుగా సంప్రదించగలిగే, నమ్మకమైన బృందాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి రోజూ వారికి మరింత చేరువగా వుండగలుగుతున్నామని అన్నారు. కీలకమైన ఐటీ మౌలిక సదుపాయాలను నిరంతరంగా పనిచేసేలా చూడటం, పరికరాల జీవిత కాలాన్ని పొడిగించడం, ఐటీ నిర్వాహణ ఖర్చులను నియంత్రించడంలో వారికి అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు.

దేశంలో తన వృద్ధి వ్యూహంలో భాగంగా రాబోయే మూడు సంవత్సరాలలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని తమ సంస్థ లక్ష్యమని ప్రకటించారు. ముఖ్యంగా సేల్స్, ఇంజినీరింగ్ విభాగాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించనుందని అన్నారు. అంతేకాకుండా స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం, సేల్స్ సామర్థ్యాలను పెంపొందించడం, భవిష్యత్ కార్యకలాపాలకు అవసరమైన నైపుణ్యాలను కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం కోసం దేశంలో Sales Excellence Academy ని ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళికలను సంస్థ రూపొందించింది. అలాగే అంతర్జాతీయ కంపెనీలతో కూడా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది.







