సింగిల్ విండో విధానంలో పౌల్ట్రీ పరిశ్రమకు అనుమతులు : సీఎం రేవంత్ రెడ్డి
POULTRY INDIA EXPO- 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
హైదరాబాద్ లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో 2026 ఏర్పాటు చేయడం అభినందనీయం
5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి విద్యార్థులకు, యువతకు పౌష్టిక ఆహారాన్ని అందించడంలో పాల్ట్రీ వ్యాపారులు భాగస్వాములు అవుతున్నారు
పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఎదురవుతున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు
సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలని ప్రతిపాదనలు అందించారు
గ్రామ పంచాయతీలలో పౌల్ట్రీ నిర్మించుకోవడానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుంది
ఎల్ నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లకు సరిపడా సన్నంబియ్యం ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉన్నాయి
కానీ పౌల్ట్రీకి సంబంధించి మొక్కజొన్నల కొరత ఉందని మా దృష్టికి వచ్చింది
ఆ సమస్యను పరిష్కరించేలా చూడాలని మా మంత్రులను ఆదేశిస్తున్నా
వ్యవసాయ కూలీలకు, రైతులకు ఉపాధి కలిగించే పరిశ్రమ పౌల్ట్రీ
పౌల్ట్రీ ఇండస్ట్రీ కేవలం కోళ్లను, గుడ్లను ఉత్పత్తి చేయడమే కాదు.. రైతుల ఆర్ధిక శక్తిని బలోపేతం చేస్తుంది
ఈ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తాం.
ఒడిదుడుకులను తట్టుకుని పరిశ్రమలో నిలబడటం, పరిశ్రమను కాపాడటాన్ని ప్రభుత్వం అభినందిస్తోంది
పౌల్ట్రీని కూడా ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా పాలసీలను రూపొందిస్తాం
కాలానుగుణంగా, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఇంప్రూవ్ చేసుకుంటాం
పాలసీలు, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో మీకు చింత అవసరం లేదు.
తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు
గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి పాలసీలను కొనసాగిస్తూనే, కొత్త పాలసీలను తీసుకొస్తున్నాం
2047 నాటికి తెలంగాణకు 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం
హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘు వీర్ రెడ్డి, ఈశ్వర్ కుమార్, రాజ్ కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మాల్ రెడ్డి రాం రెడ్డి, శివసేనా రెడ్డి, పౌల్ట్రీ ఇండియాగా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్, తదితరులు.







