ఈసీఐఎల్‌కు అరుదైన గౌరవం
హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. మావన వనరుల శాఖకు చెందిన స్వయంప్రభ పథకానికి అందించిన సేవలకు గాను ఈసీఐఎల్‌ను ఈ అవార్డు వరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈసీఐఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ కిశోర్ రుంగ్తా ఈ అవార్డును అందుకున్నారు.













