హైదరాబాద్ మేయర్ కు కాలిఫోర్నియా ప్రతినిధి ఆహ్వానం
అమెరికాలోని కాలిఫోర్నియాలో బాప్టిస్ట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ల్యారీ లినమెన్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ నగర అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను ఆయనకు వివరించారు. కరోనా సమయంలో కాలిఫోర్నియా మేయర్ నుంచి అందిన సాయం మరువలేమన్నారు. హైదరాబాద్, కాలిఫోర్నియాల మధ్య సిటీ ఆఫ్ రివర్ సైడ్ సిస్టర్ సిటీ ఒప్పందం 2000లో జరిగిందని, 2025 నాటికి 25 సంవత్సరాలవుతోన్న సందర్భంగా వేడుకలకు కాలిఫోర్నియా రావాలని లినమెన్ మేయర్‌ను ఆహ్వానించారు.













