తెలుగు పరిశోధకుడికి జాతీయ స్థాయి గుర్తింపు
అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి డాక్టర్ అల్లూరి పద్మరాజుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. వ్యవసాయ పరిశోధనలకు సంబంధించి జాతీయస్థాయిలో అత్యున్నత స్థాయి ప్రభుత్వ రంగ సంస్థ అయిన అఖిల భారత వ్వవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)లో పద్మరాజుకు చోటు దక్కింది. దేశంలో వ్వవసాయ విశ్వవిద్యాలయాల విద్యా ప్రామాణికతను నిర్దేశించి వర్సిటీలకు గుర్తింపునివ్వడం, పాఠ్యాంశం రూపకల్పన, బోధన, విశ్వవిద్యాలయాల పరిపాలన, అర్థిక అంశాలపై మార్గదర్శకాలను ఐసీఏఆర్ రూపొందిస్తుంది. కీలకమైన ఈ బోర్డులో ప్రతిభావంతులైన వ్యవసాయ శాస్త్రవేత్తల విభాగంలో అల్లూరి పద్మరాజుకు స్థానం దక్కింది. ఈ బోర్డులో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మరాజుకు మాత్రమే స్థానం దక్కింది. డాక్టర్ పద్మరాజుది తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె.













