అమెరికా యూనివర్సిటీ శిక్షణకు డిజిథాన్ ఏఐ బృందం
ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ)లో నిపుణులను తయారు చేసేందుకు తెలంగాణ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) అనుబంధమైన డిజిథాన్ ఆధ్వర్యంలో అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్‌తో కలిసి నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఇంటర్షిప్ మొదటి బ్యాచ్ అమెరికాకు బయలుదేరి వెళ్లింది. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీ, కాలేజీలకు చెందిన ప్రొఫెసర్లు, ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులతో కూడిన ఈ బృందానికి డిజిథాన్ అధ్యక్షుడు సందీప్ మఖ్తల హైదరాబాద్‌లో వీడ్కోలు పలికారు. నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ విధానంలో అమెరికాలోనే ఉండి ఆర్టీఫిషీయల్ ఇంటలిజెన్స్‌పై వారు శిక్షణ పొందనున్నారు. ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణుల కొరతను దృష్టిలో ఉంచుకొని డిజిథాన్ సంస్థతో అమెరికాలోని టాప్ 50 యూనివర్సిటీల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ (యూటిడి)తో ఒప్పందం కుదుర్చుకొని నిపుణులను తయారు చేసే శిక్షణను టీటా ప్రారంభించింది.
ఈ క్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ, కిట్స్ వరంగల్, సీజేఐటీ కాలేజీల ప్యాకల్టీలతో పాటు పలు ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు స్థానికంగా అందించే శిక్షణతో డిజిథాన్‌ను పూర్తి చేసింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ డల్లాస్ వేదికగా ఈ బృందం సభ్యులు ఆర్టీపీషీయల్ ఇంటలిజెన్స్‌పై అమెరికన్ యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఆర్టీఫిషీయల్ ఇంటలిజెన్స్‌లో భాగంగా డిజిథాన్ తదుపరి శిక్షణకు సంబంధించి బ్యాచ్ వచ్చే మార్చిలో ప్రారంభం కానుండగా దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్నవారు bit.ly/digithon_academy లింక్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని సందీప్ తెలిపారు.













