భారత్-అమెరికా సంబంధాలు ఇలాగే కొనసాగాలి : జోయెల్ రిఫ్మన్
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరుగుతున్నాయని అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రిఫ్మన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ధోరణి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర నికర విలువ జోడిరపు (నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్.. ఎన్ఎస్వీఏ)లో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అభినందనల తెలిపారు. దీనికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలుపూతూ రీట్విట్ చేశారు.













