సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆలయ ఈవో వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు.