సారూ… కారెక్కండి… బ్రతిమిలాడుతున్న కార్యకర్తలు
తెలంగాణాలో అధికార పార్టీకి కొన్ని కొన్ని సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే ఆవేదన కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలలో ఎక్కువగా వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్ ప్రచారం చేసే విషయంలో ముందు నుంచి కూడా వెనకబడి ఉన్నారు. 2018 ఎన్నికల్లో ప్రచారం చేయడం మినహా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయన పెద్దగా ప్రచారం చేసిన పరిస్థితి కనబడలేదు అని చెప్పాలి. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆవేదన కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలలో ఎక్కువగా వ్యక్తమవుతుంది.
స్వయంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీనితో టిఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొంది అనే చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఐదు స్థానాల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రచారం చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం లేకపోతే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది.
ఎన్ని వ్యూహాలు వెనక ఉండి అమలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు అనే విషయాన్ని సీఎం కేసీఆర్ గ్రహిస్తే మంచిది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తప్పుల కారణంగా కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించి సీఎం కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీనివలన టిఆర్ఎస్ పార్టీ నేతల మీద కూడా ఒత్తిడి పెరుగుతుందని చెప్పాలి. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు అగ్రనేతలు అందరూ ప్రచారం చేస్తున్నారు.
చివరికి రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేస్తారని వార్తలు వచ్చినా సరే సీఎం కేసీఆర్ మాత్రం ప్రచారం చేయలేకపోతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు రంగంలోకి దిగిన సరే హైదరాబాద్ లో కూడా సీఎం కేసీఆర్ ప్రచారం చేయడం లేదు. కనీసం హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో అయినా సరే సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే బాగుంటుంది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయినా సీఎం కేసీఆర్ మాత్రం ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. దీనిపై మంత్రులలో కూడా ఆగ్రహం ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పటికే ప్రజల్లోకి రావడం లేదని సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ ప్రచారం కూడా పెద్దగా చేయలేకపోవడంతో కార్యకర్తలలో కూడా ఒకరకమైన భయం మొదలైంది.













