కేసిఆర్ ఆమెను తక్కువ అంచనా వేస్తే మునిగినట్టే…?
తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టడం ఏమో గాని కొన్ని కొన్ని అంశాలు మాత్రం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొన్ని కొన్ని అంశాల్లో వైఎస్ షర్మిల విషయంలో సీఎం కేసీఆర్ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు షర్మిల విషయంలో సీఎం కేసీఆర్ కచ్చితంగా ఇబ్బంది పడవచ్చు అనే అభిప్రాయాన్ని కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు స్వయంగా వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి కొన్ని జిల్లాల్లో బలం చాలా తక్కువగా ఉంది. ఆ కొన్ని జిల్లాల్లో బలాన్ని సీఎం కేసీఆర్ తక్కువ అంచనా వేస్తున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీకి బలం చాలా తక్కువగానే ఉంది.
అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అలాగే ఇతర పార్టీలు కూడా అక్కడ ఎంతోకొంత ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు షర్మిల రెండు జిల్లాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా మీద కూడా ఆమె ఎక్కువగా దృష్టి సారించారు. మహబూబ్ నగర్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఆమె దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం ఉన్న వాళ్ళు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.
దీనికి సంబంధించి వైయస్ షర్మిల త్వరలోనే కొందరితో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనే అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం టిఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు. ఇక దాదాపుగా 7 జిల్లాల్లో ప్రతిపక్షాలు కాస్తో కూస్తో బలంగా ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీపై ఏడు జిల్లాల్లో కూడా వ్యతిరేకత పెరిగితే మాత్రం కచ్చితంగా అది ఇతర పార్టీలకు లాభం చేకూర్చే అవకాశం ఉండవచ్చు.
కాబట్టి షర్మిల విషయంలో సీఎం కేసీఆర్ తక్కువ అంచనా వేయకుండా ఆమె విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లి టిఆర్ఎస్ పార్టీ నేతలను నాలుగు జిల్లాల్లో కాపాడుకోవాల్సిన అవసరం ఉందని… ప్రధానంగా ఆంధ్రా సరిహద్దు జిల్లాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం మునిగి పోయే అవకాశాలు ఉండవచ్చు అని సీఎం కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.













