అదే ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుంది : కేసీఆర్
ఓటును ఆషామాషీగా వేయొద్దని, అది ప్రజల ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సుదర్శన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని కోరారు. మీ అందరినీ నేను కోరేది ఒకటి. ఏదైనా ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే, నేను చెప్పే నాలుగు మాటలను మీ ఊళ్లకు వెళ్లిన తర్వాత నిజానిజాలు తేల్చాలి. అప్పుడు ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది. 30న ఓట్లు పడుతయ్. 3న ఓట్లు లెక్కిస్తరు. అక్కడికి దుకాణం అయిపోతుందని మీరు అనుకుంటరు. కానీ అక్కడికే అయిపోతు. ఆ తర్వాత తతంగం చాలా ఉంటది. ఎవరైతే నాయకులు నిలబడ్డరో వీళ్ల వెనుక చాలా పెద్ద పార్టీలున్నాయ్. అభ్యర్థి కమిట్మెంట్, వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలి. వారికి ఆధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తారనే విషయాలను గమనించాలి. ప్రజాస్వామ్యం పరిణితి అంటేనే ఇదేనన్నారు.













