మాట నిలబెట్టుకున్న సిఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మేడ్చల్ జిల్లాలోని రెండు గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చి 24 గంటలు గడవక ముందే హామీల అమలుకోసం అవసరమైన నిధులు మంజూరయాయి. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని కేశవాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల మీదుగా గురువారం ముఖ్యమంత్రి తన ఫాంహౌజ్‌కు వెళ్లారు. అలా వెళుతూ, ఈ రెండు గ్రామాల్లో కొద్దిసేపు ఆగిప్రజలతో మాట్లాడగా, కొన్ని సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పబోయారు. దాంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ, శుక్రవారం గ్రామ సభలు ఏర్పాటు చేసి కూలంకషంగా సమస్యలు వింటానని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రెండు గ్రామాల్లోనూ శుక్రవారం గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా కేశవాపూర్ గ్రామంలో 12.26 కోట్ల రూపాయలు, లక్ష్మాపూర్ గ్రామంలో 15.50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపడతామంటూ కెసిఆర్ హామీ ఇచ్చారు.













