మంత్రి నారాయణ కుమారుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశీత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబసభ్యులకు సానూభూతి తెలిపారు. ఈ విషయంపై మంత్రి నారాయణతో కూడా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.
పలువురు సంతాపం :
రాష్ట్ర మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి పట్ల కేంద్ర మంత్రి సుజనా చౌదరి తోపాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావు, కళా వెంకట్రావు, అమరనాథరెడ్డి, పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాస్‌రావు, ప్రతిపాటి పుల్లారావు, శాసన మండలి చైర్మన్ ఏ.చక్రపాణి, ఎవ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ నిశీత్ మృతిపట్ల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, నారాయణ, ఎంపీ డీ. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పవన్ కల్యాణ్, నందమూరి హరికృష్ణ నిశీత్ మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.













