కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏటా సెప్టెంబరు 17న

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో విలీనమైన సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత వరకు హైదరాబాద్ ప్రాంతం నిజాం పాలనలో ఉంది. ఆపరేషన్ పోలో పేరుతో నిర్వహించిన పోలీసు చర్య అనంతరం 1948 సెప్టెంబరు 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది.