పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు : వినోద్ కుమార్
పునర్విభజన పేరుతో జిల్లాలను మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో చర్చలు జరిపి జిల్లాలు ఏర్పాటు చేశామని, పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. లక్షా 90 వేల ఖాళీలను నెల రోజుల్లో గుర్తించాలని, ఈ ఏడాది చివరిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్‌కు బాధ్యతలు పెరిగాయని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నల్గొండలో బీఆర్ఎస్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానం ద్వారా తీసుకుంటామని తెలిపారు.













