బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు.. మరోసారి

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి చంపుతామని బెదిరించినట్టు రాజాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. అయినా, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసులకు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డీజీపీకి లేఖ రాశారు.