అసెంబ్లీకీ నేను రాకపోవడానికి కారణం ఇదే
ధర్మరక్షణ, దేశ రక్షణ కోసం ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నామని, అందులో భాగంగా బెంగుళూరులో క్యాంప్ నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఉన్న ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం లేదని సీఎం కేసీఆర్ అంటున్నారని అసెంబ్లీ సమావేశాలకు ముందే బెంగుళూరులో క్యాంప్‌కు సంబంధించి ప్లాన్ సిద్ధం చేసుకున్నామని చెప్పారు. హిందూ రాష్ట్రం తమ సంకల్పమని, దీనికి సంబంధించి సైన్యం కావాలని, మొత్తం భారత దేశంలోని హిందూ రాష్ట్రం, ధర్మం, దేశ రక్షణ కోసం సైన్యం తయారు చేస్తున్నామని తెలిపారు. అందుకే తాను అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయానని సృష్టం చేశారు. జాతికి ఉపయోపగడే పనిలో తాను బిజీగా ఉన్నానని, క్యాంప్ 10 రోజులు ఉంటుందని రాజాసింగ్ సృష్టం చేశారు.













