బొమ్మలను చెక్కిన మీరు..అవినీతిని కూడా చెక్కుతారా?
యాదాద్రి స్తంభాలపై చెక్కిన సీఎం కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ పార్టీ గుర్తును తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారంలోపు తొలగించకపోతే భారతదేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర నాయకత్వంతో చర్చించి యాదాద్రిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. యాదాద్రిని ప్రజల సొమ్ముతో కట్టినవా? నీ సొంత సొమ్ముతో నిర్మిస్తున్నవా? భవితరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కిన మీరు, వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా అని ప్రశ్నించారు.













