రైతుబిడ్డకే బిగ్ బాస్ కిరీటం
సాధారణ రైతుబిడ్డకే బిగ్బాస్-7 కిరీటం దక్కింది. 105 రోజులుగా కొనసాగుతున్న ఈ రియాల్టీ షో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో సినీనటుడు, బిగ్బాస్ హోస్ట్ నాగార్జున విజేతను ప్రకటించారు. పైనల్లో టైటిల్ కోసం ప్రశాంత్తోపాటు అర్జున్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్, ప్రియాంక పోటీలో నిలిచారు. నలుగురు ఎలిమినేట్ కాగా అమర్దీప్, ప్రశాంత్ మధ్య ఆఖరి పోటీ ఏర్పడింది. ప్రేక్షకుల్లో ఓట్లు, షాలో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రశాంత్ అంతిమ విజేతగా నిలవడంతో పాటు రూ.35 లక్షల నగదు, కారు, రూ.15 లక్షల విలువైన బంగారం దక్కించుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరుకు చెందిన పల్లవి ప్రశాంత్ గతంలో రైతుబిడ్డ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేస్తూ ప్రజాదరణ పొందారు. ఈ క్రమం లోనే బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం లభించింది.













