భూదాన్‌పోచంపల్లి కి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ టూరిజం విలేజ్‌గా ఎంపికైన భూదాన్‌పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సమావేశంలో అవార్డు అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అవార్డును భారత్ తరపున స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండో కార్యదర్శి సుమన్ శేఖర్ స్వీకరించారు.













