గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన బండారు దత్తాత్రేయకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బీసీ, వివిధ కుల సంఘాల నేతలతో పాటు పలువురు రాజకీయ పార్టీల ముఖ్యనేతలు కార్యక్రమానికి హాజరై ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం సన్మాన గ్రహీత, గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తాను ఎక్కడ ఉన్నప్పటికీ బీసీల అభ్యున్నతికి పాటుపడుతానని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కృష్ణయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం, సినీ నటుడు సుమన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పాల్గొన్నారు.













