బండి సంజయ్ పాదయాత్ర ముగింపు ఎక్కడ?
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపుకోసం బిజెపి సర్వశక్తులను ఒడ్డుతోంది. మరోవైపు ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడడటంతో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ముందుగా హుజూరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించాలనుకున్నా.. షెడ్యూల్ వెలువడటంతో హుస్నాబాద్ కు మార్చారు. ఈ ముగింపు సభ ద్వారా బిజెపిని ఎందుకు గెలిపించాలన్న విషయాన్ని వెలువరించడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నాయకుల అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు.













