తెలంగాణకు దక్కిన గౌరవం : దత్తాత్రేయ
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం దత్తాత్రేయ మొదటిసారి తెలంగాణకు విచ్చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ తనను గవర్నర్గా నియమించడమనేది పుణ్యఫలంగా భావిస్తున్నట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా యాదాద్రి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. నన్ను గవర్నర్గా నియమించడమనేది తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. యాదాద్రి ఆలయం దేశంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విరసిల్లాలని ప్రార్థిస్తున్నాను. హిమాచల్ ప్రదేశ్ అనేది ఎన్నో శక్తిపీఠాలున్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లోని ఆధ్మాత్మిక కేంద్రాలను లింక్ చేసి టూరిజం అభివృద్ధికి తోడ్పడతాను. హిమాచల్ ప్రదేశ్ అనేది గొప్ప దేవభూమి, వీరభూమి. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అనేది రెండు గొప్ప పోరాటల గడ్డ. సమాజంలో నైతికత పెరగాలి. ప్రజలు ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని అని అన్నారు.













