దత్తాత్రేయ కుమార్తెకు లైన్ క్లియర్ ?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ సీనియర్ నేత, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మికి దాదాపు లైన్ క్లియర్ అయింది. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌ను పార్టీ అధిష్ఠానం రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఇక్కడి నుంచి ఆమెకే టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు. ముషీరాబాద్‌లో ఆ పార్టీకి పెద్ద దిక్కు, ఏడు సార్లు పోటీ చేసిన లక్ష్మణ్.. రాబోయే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంతా భావిస్తున్న తరుణంలో విజయలక్ష్మి ముషీరాబాద్‌తో పాటు అంబర్‌పేట, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే లక్ష్మణ్ రాజ్యసభకు వెళ్తుండడంతో రాజకీయ సమీకరణాలు మరాయి. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి అనుచర వర్గంలో నూతనోత్తేజం వెల్లివిరిస్తోంది.













