నేడు రేపో కాంగ్రెస్ కు కోమటిరెడ్డి గుడ్ బై!
నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంగా కొనసాగుతున్నారు. అయితే తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు వెంకటరెడ్డి కూడా పార్టీ వీడుతారని చాలామంది భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తను బిజెపిలో చేరాబవట్లేదని, కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్తూ వచ్చారు. కానీ అడపాదడపా బిజెపి అగ్రనేతలు మోడీ, అమిత్ షా తదితరులతో భేటీ అవుతూ వచ్చారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బిజెపిలో చేరడం ఖాయమని భావించారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు అర్థమవుతుంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోంది కోమటిరెడ్డి ఫ్యామిలీ. పైగా నల్గొండ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చాలా మంది సీనియర్లు పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. అందులో కోమటిరెడ్డి కూడా ఒకరు. రేవంత్ రెడ్డికి పిసిసి అప్పగించిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. తనకు పిసిసి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి కి నిరాశ మిగలడంతో పార్టీ పైన, రేవంత్ రెడ్డి అనుచరుల పైన పలుమార్లు విమర్శలు గుప్పించారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లోనే ఓవర్గం డిమాండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ హై కమాండ్ కూడా కోమటిరెడ్డి నుంచి వివరణ తీసుకుంది.
కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎవరు ఏది మాట్లాడినా అధిష్టానం చూస్తూ ఊరుకుంటుంది. చర్యలు తీసుకోదు. ఇది మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోకుండా నాన్చుతూ వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీలో మరిన్ని సమస్యలకు కారణమైంది. మునుగోడులో మన సోదరుడు, బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని తన అనుచరులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. ఈ ఆడియో బయటకు వచ్చింది. దీనిపైన అధిష్టానం చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అనుచరులపై చేసిన కామెంట్స్ కూడా వివాదాలకు దారి తీసాయి. అయినా అధిష్టానం పట్టించుకోలేదు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుధీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో ఆయనకు తగిన గౌరవం ఇస్తూ వచ్చింది అధిష్టానం. అయితే తనకు పిసిసి ఇవ్వకపోవడం, పైగా టిడిపి నుంచి వచ్చిన వాళ్లకు పక్కాలో అప్పగించడం వెంకట్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే పార్టీని విడాలని నిర్ణయం తీసుకున్నారు. నేడు రేపు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిద్ధమయ్యారు. కోమటిరెడ్డి వెళ్ళిపోతారని చాలా కాలంగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు అది జరగబోతోంది.













