టీచ్ ఫర్ ఛేంజ్ మరియు వేణిరావు ఫౌండేషన్ భాగస్వామ్యం తో మణికొండ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించారు
ప్రముక సినీనటి లక్ష్మి మంచు 2014లో స్థాపించిన టీచ్ ఫర్ ఛేంజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో కొనసాగుతుంది. ఈ సంస్థ ద్వారా మూడు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 67,336 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా టీచ్ ఫర్ ఛేంజ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రాథమిక భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకుసాగుతుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఒక గదిని ఎంపిక చేసి గోడలకు రంగులు వేసి, పిల్లలు చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా పిల్లల మానసిక ఉల్లాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం తరగతి గదిని డిజిటల్ తరగతులుగా మార్చుతున్నాం. తరగతి గదిలో ఫ్లాట్ స్క్రీన్ ఏర్పాటుచేసి లో లైయింగ్ టేబుల్, కార్పెట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక పిల్లల ఫోనిక్స్, భాషా సామర్థ్యాలను పెంచేందుకు ఆడియో విజువల్ కరిక్యులం ద్వారా విద్యార్థులకు సులువైన రీతిలో, ఆసక్తికరంగా పాఠాలు బోధించడం జరుగుతుంది.
రంగారెడ్డి జిల్లాలో తొలుతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లున్నారు. ఇందుకోసం టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ వేణిరావు ఫౌండేషన్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకొంది. ఇందుకు అనుగుణంగానే రంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన దాదాపు 25 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్మార్ట్ డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వేణిరావు సంస్థ వీటి ఏర్పాటుకు అవసరమైన ఆర్ధిక సహకారాన్ని అందిస్తుంది. మణికొండ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వేణిరావు. ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక ట్రస్టీ, చిరక్ స్కూల్ వ్యవస్థాపకురాలు రత్నారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి పి. సుసీంద్రరావులతో కలిసి మంచు లక్ష్మి పాల్గొన్నారు. వెనుకబడిన, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు తమ ఆర్థక సహకారాన్ని అందించినట్లు రత్నారెడ్డి తెలిపారు. మున్ముందు మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చేరువవుతామన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ అక్షరాస్యతను పెంచడం తోపాటు నైపుణ్యాలను, ప్రాథమిక అక్షరాస్యతను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సినీనటి లక్ష్మీ మంచు, వేణి రావు ఫౌండేషన్ రత్న రెడ్డి, టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ నిర్వహకులు చైత్యన, సెక్టరీడల్ ఆఫీసర్ జావెద్, మనకొండ స్కూల్ HM మాన్య నాయక్, కౌన్సెకర్ రామకృష్ణ రెడ్డి GHM రంగారెడ్డి నిర్జన్ మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.













