బీజేపీ లోకి దివ్యవాణి?
మాజీ టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శామీర్‌పేటలో ఉన్న బీజేఎల్పీ నేత ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన దివ్యవాణి, ఆయనతో భేటీ అయ్యారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారు. దివ్యవాణి ముఖ్యంగా తెలంగాణలో యాక్టీవ్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆమె టీడీపీలో చేరారు. అధికార స్పోక్స్ పర్సన్‌గా పనిచేశారు.ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే మే నెలలో జరిగిన మహానాడులో జరిగిన ఓ సంఘటనతో దివ్యవాణి టీడీపీకి దూరమయ్యారు.













