BJP: తెలంగాణ బీజేపీ .. మరో కీలక నిర్ణయం
తెలంగాణ బీజేపీ (BJP) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై (Projects) అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ (Assembly)లో నీటి కేటాయింపులపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ( BRS) నేతలు కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కమలం పార్టీ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు.






