ఘనంగా తేజ్ ప్రతాప్- ఐశ్వర్యరాయ్ నిశ్చితార్థం
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ఎంగేజ్మెంట్ పాట్నాలోని హోటల్ మౌర్యలో జరిగింది. అయితే ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ మాత్రం దీనికి హాజరు కాలేదు. ఆర్జేడీకే చెందిన చంద్రికా ప్రసాద్ రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌తో తేజ్ ప్రతాప్ ఎంగేజ్మెంట్ జరిగింది. వీళ్ల ఎంగేజ్మెంట్ సెర్మనీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెకరేషన్ కోసం ప్రత్యేకంగా ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె నుంచి పూలు తీసుకొచ్చారు. ఇక ఈ ఎంగేజ్మెంట్కు పలువురు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. ప్రియాంకా గాంధీకి కూడా ఆహ్వానం పంపినా ఆమె వచ్చారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. వచ్చే నెలల్లో వీళ్ల పెళ్లి జరగనుంది. బీహార్‌లోని మహువా నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా కూడా పనిచేశారు.













