బుల్లి ఉపగ్రహం తయారు చేసిన విద్యార్థులు
తమిళనాడులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రపంచంలోనే అతి చిన్న ఉపగ్రహాన్ని రూపొందించారు. అత్యంత చిన్న ఉపగ్రహమే కాదు.. అత తక్కువ వ్యయంతో దాన్ని తయారు చేశారు. ఎంత చిన్నదంటే అరచేతిలోని పెట్టడానికి సరిపోయేంత. ఈ బుల్లి ఉపగ్రహం తయారు చేయడానికి కేవలం 15వేల రూపాయలు ఖర్చయింది. ఓ మీడియం సైజ్ గుడ్డు కంటే తక్కువగానే ఉపగ్రహం ఉంటుంది. చెన్నై సమీపంలోని కేలంబక్కం హిందూస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు కేజే హరిక ష్ణన్, పీ అమర్నాథ్, జీ సుధి, టీ గిరిప్రసాద్ ‘జైహింద్ 1 ఎఎస్’ను రూపొందించారు.
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థులు రూపొందించిన ఈ బుల్లి ఉపగ్రహానికి ‘జై హింద్ 1 ఎస్’అని పేరుపెట్టారు. జైహింద్ ఉపగ్రహం బరువు33.39 గ్రాములు. దాని ఆకారం ఓ చిన్న నాలుగు సెంటీమీటర్ల క్యూబ్లా ఉంటుంది. ఆగస్టుల నెలలో జైహింద్ 1 ఎస్‌ను నాసా నుంచి ప్రయోగించనున్నారని ఓ వార్త సంస్థ వెల్లడించింది. బెలూన్ లేదా రాకెట్‌కు కట్టి దాన్ని ప్రయోగిస్తారు.ఇరవై రకాలైన వాతావరణ పారామీటర్లను రికార్డు చేయగలిగే సామర్థ్యాన్ని ఈ బుల్లి ఉపగ్రహానికి కల్పించారు. ఒక్క సెకన్‌కు నాలుగు రకాలైన పారామిటర్లను ఇది నమోదు చేస్తుంది. ఇదంతాలోపల అమర్చిన ఎస్డీ కార్డులో నిక్షిప్తమవుతుంది. కిందకొచ్చిన తరువాత డాటాను సేకరిస్తారు.













