వారిని విడుదల చేయాలి
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైలో ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించి, దానిని వెంటనే గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్‌కు పంపింది. మురుగన్, శంతన్, పెరారివలన్, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పయాస్, నళినిలను విడుదల చేయాలని క్యాబినెట్ తీర్మానించిందని, క్షమాభిక్షపై నిర్ణయం గవర్నర్దేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఈ తీర్మానం చేశామని ఆ రాష్ట్ర మంత్రి జయకుమార్ తెలిపారు.













